ఇటుక బట్టిలో శివరాత్రి వేడుకలు

2236చూసినవారు
ఇటుక బట్టిలో శివరాత్రి వేడుకలు
మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో ఎమ్మేవార్ గోవింద్ ఇటుక బట్టిలో శనివారం రోజున శివ రాత్రి ఉత్సాహాలు నిర్వహించడం జరిగింది. మహారాష్ట్ర లోని కందార్ పుల్వార్ గ్రామ మహరాజ్ ప్రతి ఏటా బిచ్కుంద శివరాత్రి ఉత్సాహాలకు పాదయాత్ర ద్వారా చేరుకోవడం జరుగుతుంది. ఎమ్మేవార్ గోవింద్ గత 11 సంవత్సరాల నుండి పాదయాత్ర ద్వారా వెళ్లే భక్తులకు ఇటుక బట్టిలో పూజలు నిర్వహించి భక్తులకు శివరాత్రి అల్పాహారం అందిస్తున్నారు. ఎమ్మేవార్ గోవింద్ - అనురాధ, ఎమ్మేవార్ గోపాల్ - సవిత కుటుంబీకులు శివరాత్రి రోజున ఇటుక బట్టీలో మహరాజ్ బస్వరాజ్ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది. ఇటుక బట్టిలో శివరాత్రి ఉత్సాహాల సందర్భంగా మహరాజ్ శివరాత్రి యొక్క విశిష్టత తదితర అంశాలను భక్తులకు తెలియజేసి దైవ భక్తి చాటుకొనే విధంగా కీర్తనలు, భజనలు, భక్తి ప్రసంగాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఇటుక బట్టి కార్మికులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్