జుక్కల్ సెగ్మెంట్ డోంగ్లి మండలం లింబూర్ గ్రామ సమీపంలో రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఆదివారం మద్నూర్ ఎస్ఐ. విజయ్ కొండ తెలిపారు. మంజీర నది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నందున వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామన్నారు.