అన్నా భావు సాఠే ఆశయ సాధనకు యువత కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో సాహిత్య రత్న, లోక శాహిర్ అన్నా భావు సాఠే 104వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొని అన్నాభావుసాఠే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రతీ ఏటా మహనీయుల జయంతి వేడుకలు జరుపుకోవడమే గాక వారు చూపించిన మార్గాల్లో నడవాలన్నారు.