నిజామాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే
కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి అన్న, మామ, బాబాయ్ అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను గురువారం అభ్యర్థిస్తున్నారు.