
ఎల్లారెడ్డి: శ్రీకాలబైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
దక్షిణ కాశిగా విరాజిల్లుతున్న ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని రామారెడ్డి మండల కేంద్రంలో కొలువై వున్నా శ్రీ కాల బైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి ఉదయం బ్రహ్మనోత్తములు స్వామికి మంగళస్నానం, పాలాభిషేకం చేసి, ప్రత్యేకలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ, కర్ణాటక, మహరత్ర నుండి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు.