బీబీపేటలో బిజెపి మండల కమిటీ సమావేశం
భారతీయ జనతా పార్టీ బీబీపేట మండల అధ్యక్షుడు బట్టుపల్లి రంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు యాడారం స్వామి పాల్గొన్నారు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో గెలుపు దిశగా అందరూ సిద్ధంగా ఉండాలని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని విపుల్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పదాధికారులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.