నసురుల్లాబాద్: కొచ్చర్ మైసమ్మ ఆలయ అభివృద్ధికి విరాళం అందచేత
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో గల కొచ్చర్ మైసమ్మ ఆలయ అభివృద్ధికి బోధన్ మండలం అంగర్గా గ్రామానికి చెందిన ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ శివరామకృష్ణ రూ. 10,000 విరాళం శనివారం అందజేశారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు ఆయను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పెరుక శీను, మాజీ సర్పంచ్ సాయిరాం, వడ్ల వెంకటి, జగన్, డాక్టర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.