మున్సిపల్ పరిధిలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తే చర్యలు

79చూసినవారు
మున్సిపల్ పరిధిలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తే చర్యలు
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు హెచ్చరించారు. బుధవారం మీడియాతో మాట్లడుతూ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టిన అట్టివారిపై శాఖా పరమైన చర్యలుంటాయన్నారు. అనుమతులు ఉండి, సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన నిర్మాణాల పట్ల చర్యలుంటాయన్నారు. అనుమతి తీసుకొని నిర్మాణాలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్