ఉప్పల్ వాయిలో గ్రామసభ

74చూసినవారు
ఉప్పల్ వాయిలో గ్రామసభ
రామారెడ్డి మండలం ఉప్పల్ వాయిలో గురువారం గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో విద్య, వైద్యం, పరిశుభ్రత, ఉపాధి హామీ పనులు, గ్రామంలో ఉన్న సమస్యలను చర్చించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీలో ఉన్న ఆదాయ, వ్యయాలను సభలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్