జనవరి 26 నుండి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీకి రంగం సిద్ధం చేస్తుందని ఎల్లారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి మండలంలోని అజమాబాద్, అన్నసాగర్ గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలు వివరిస్తూ, సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత వెంకట్రామిరెడ్డి ఉన్నారు.