వైదిక యజ్ఞం హైందవ సంస్కృతి నాగరికతను తెలియచేయడమే కాకుండా ప్రకృతిని పునీతం చేస్తుందని, ఎల్లారెడ్డి పతంజలి యోగగురువు నాగరాజుగౌడ్, ఆర్యసమాజ్ సదస్యులు దయానంద్ లు అన్నారు. బుధవారం ఆర్యసమాజ పరివారం ప్రతి రోజు ప్రతి ఇంట్లో యజ్ఞం సంధర్బంగా ఓ ఇంట్లో యజ్ఞం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. గురువారం సాయంత్రం 5. 00 గంటలకు స్థానిక వైశ్యా భవన్ లో యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నామన్నారు.