కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్‌లో కంగువ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య పలువురు ఆదివాసీ మహిళలతో కలిసి డ్యాన్స్ వేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.