నడిరోడ్డుపై ఓ కారులోని వ్యక్తులపై కన్వర్ యాత్రికులు కర్రలతో దాడికి పాల్పడిన ఘటన యూపీలోని మీరట్‌లో చోటుచేసుకుంది. హరిద్వార్ నుంచి కన్వరీయులు గంగ జలాన్ని తీసుకెళ్తుండగా, రాంగ్‌రూట్‌లో వచ్చిన ఓ కారు వారిని ఢీకొట్టంతో కన్వర్ దెబ్బతిన్నది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై వారిపై దాడి చేశారు. అయితే వారు రావద్దని సైగలు చేసిన వినిపించుకోలేదని కన్వరీయులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.