ఢిల్లీ సీఎం ఆతిశీపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రమేశ్ బిధూడీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లుగా ఢిల్లీ సమస్యలను పట్టించుకోని ఆతిశీ.. ఎన్నికలు సమీపించిన వేళ ఓట్ల కోసం నగర వ్యాప్తంగా జింకలా పరుగెడుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఆతిశీ ఇంటిపేరు మార్చుకుందని గతవారం కూడా బిధూడీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆప్ తీవ్రంగా మండిపడుతోంది.