కాంగ్రెస్ పార్టీకి గంగాధరం మండలానికి చెందిన పలువురు నాయకులు మూకుమ్మడి రాజీనామా చేశారు. గంగాధర మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు పొన్నం విజయ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం నాడు తెలిపారు. కాగా ఈమెతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పొన్నం పర్సరాములు, జనగాం విద్యాసాగర్ రెడ్డి, నాయిని రాజేందర్, బాపనేని నర్సయ్య, పంజాల మహేష్, చంద్రయ్య తదితరులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. కాగా తామంతా వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.