బుగ్గారం: పొగ మంచుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల ప్రాంతంలో శనివారం భారీగా పొగ మంచు ఏర్పడింది. ఈ పొగ మంచుతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాహనాల లైట్లు వేసుకొని ప్రయాణం చేసినా దారి కనబడక ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వచ్చే వాహనాలకు రోడ్డు ఏర్పడక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వాహనదారులు తెలిపారు.