పాలసీదారులు చెల్లించే జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలని, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెరగకూడదనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉద్యమం ప్రారంభించింది. ప్రజాసంఘాల ప్రతినిధులు త్వరలో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశమై తమ డిమాండ్లను పార్లమెంట్‌లో లేవనెత్తనున్నారు. అలాగే కొత్త లేబర్ కోడ్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.