బోయినపల్లి: మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి మృతికి సంతాపం
బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గూడూరి ఉమాదేవి భర్త సురేందర్రావు అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామ ఎంపీటీసీ సభ్యురాలుగా 1995 నుండి 2000 సంవత్సరం పదవి చేపట్టారు. గ్రామ అభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారు. వారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. శుక్రవారం ఆమె మృతి పట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు.