తప్పు చేసిన కానిస్టేబుల్‌పై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం (వీడియో)

67చూసినవారు
TG: హనుమకొండలోని కుమార్ పల్లి మసీదు దగ్గర రోడ్డు దాటుతున్న షాహిద్ అనే బాలుడిని ఓ కానిస్టేబుల్ బైక్‌తో ఢీకొట్టాడు. అంతేకాకుండా కావాలంటే కేసు పెట్టుకోండి అని దురుసుగా మాట్లాడి వెళ్ళిపోయాడు. మంత్రి కొండా సురేఖ ఈ విషయం తెలుసుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు ఫోన్ చేశారు. తక్షణమే కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గాయపడ్డ బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్