ఎండపల్లి మండలం లోని గొడిశెలపేట, ముంజంపల్లి, మారేడుపల్లి, గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం వ్యవసాయ శాఖ ఎండపల్లి మండల అధికారి కమల్ల మహేష్ సందర్శించారు. గొడిశెలపేట క్లస్టర్ పరిధి లోని ఈ మూడు గ్రామాల రైతులకి తూకానికి ముందు వరి ధాన్యం తప్ప, తాలు లేకుండా తేమ శాతం మరియు నాణ్యత ప్రమాణాలు పాటించుకుంటూ ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలకు వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని ఎఈఒ సూచించారు.