కుమ్మరిపల్లి ఆదర్శ విద్యార్థులకు ఆరోగ్య శాఖ అవగాహన సదస్సు

81చూసినవారు
కుమ్మరిపల్లి ఆదర్శ విద్యార్థులకు ఆరోగ్య శాఖ అవగాహన సదస్సు
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరిపల్లి ఆదర్శ పాఠశాలలో మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు కాలానుగుణ వ్యాధులపై అవగాహన సమావేశం నిర్వహించారు. గురువారం నులిపురుగుల నివారణ కై నిర్వహించనున్న కార్యక్రమం పై కూడా వైద్యాధికారి గొట్టె శ్రావణ్ కుమార్ అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో కుమార్ సీహెచ్ఓ పి. జగన్నాథం, సూపర్వైజర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ కట్ల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్