ఇల్లంతకుంట: మాజీ ఎంపీటీసీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం శుక్రవారం ముస్కాన్ పేట మాజీ ఎంపీటీసీ సావనపెళ్లి వనజ అనీల్ తండ్రి ఇటీవల మృతి చెందగా, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వారి కుటుంబాన్ని పరామర్శించి, మృతుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎండ్రచందన్ అంతగిరి, మాజీ ఉపసర్పంచ్ బుర్ర బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.