TG: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని రోజులు రెస్ట్ మోడ్‌లోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని నేడు ఎక్స్ వేదికగా తెలిపారు. 'నేను రీఫ్రెష్ కావాలనుకుంటున్నా. అందుకే కొన్ని రోజులు అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను మర్చిపోరని ఆశిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.