హుజురాబాద్ డివిజన్ పరిధిలో ఈ నెల 14న హోలీ పండగను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసు అధికారులు తెలిపారు. హోలీ రోజున మద్యం దుకాణాలు మూసి ఉంటాయని సూచించారు. వాహనాల పై రంగులు చల్లకూడదని బహిరంగ ప్రదేశాల యందు గుమిగూడారాదని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం హెచ్చరించారు.