తెలంగాణలో అతిపెద్ద పండుగల్లో దసరా ముఖ్యమైనది. విజయదశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. తెలంగాణలో దసరా నాడు తప్పనిసరిగా అంతా పాలపిట్టను దర్శనం చేసుకుంటారు.గ్రామాల్లో అయితే పొలాల్లో.. చెరువు గట్టుల్లో ప్రత్యేకంగా పాలపిట్ట దర్శనం చేసుకుంటుంటారు. ఈ పాలపిట్టను దుర్గామాత స్వరూపంగా చెబుతారు. పాలపిట్ట దర్శనం శుభ సూచకం అని పురాణాలు చెబుతున్నాయి.