జగిత్యాల రూరల్ మండల పరిధిలోని కల్లెడ గ్రామ శివారులోని చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమయింది. వ్యక్తి వయస్సు సుమారుగా 30-35 సంవత్సరాలు ఉంటుందని మృతదేహంపై ముదురు నీలిరంగు, తెలుపు రంగు గీతల డబ్బాలు గల చొక్కా, నేవీ బ్లూ రంగు నిక్కర్ ఉన్నాయి. మృతదేహం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో ఉందని. వ్యక్తి వివరాలు తెలిసినవారు ఫోన్ నెంబర్ 8712656822 కు వివరాలు తెలుపగలరన్నారు.