జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్పూర్ కు చెందిన మమత అనే మహిళ సంక్రాంతి పండగ సెలవులకి తన కూతురును గోదావరిఖనిలో హాస్టల్ నుండి తన స్వగ్రామం కు శనివారం రాత్రి తీసుకువస్తుండగా బస్ లలో కిక్కిరిసిన ప్రయాణికుల మధ్య ప్రయాణం చేసింది. ఈ క్రమంలో జగిత్యాల కొత్త బస్ స్టాండ్ లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెకు సిపిఆర్ చేసి 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది.