37 సంవత్సరాల తర్వాత కలిసిన ఓల్డ్ హైస్కూల్ విద్యార్థులు
జగిత్యాల మండలం జాబితాపూర్ లోని వెన్నెల గార్డెన్ లో ఆదివారం మధ్యాహ్నం 1986- 87లో పదవ తరగతి చదివిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యాపకులు ధర్మపురి గుండయ్య, తులా నరసింహారావు, వెంకటేశ్వర్లు, గంగాధర్ తో పాటు 8 మంది గురువులను సత్కరించారు. ఒకేసారి 150 మంది విద్యార్థులు 37 సంవత్సరాల తర్వాత కలవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.