కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామపంచాయతీ ఆవరణలో ధనుక కంపెనీ వారి ఆధ్వర్యంలో రబీ సీజన్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, మెలకువలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రబీ సీజన్ లో మొక్కజొన్న, వరి పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న నేపథ్యంలో విత్తనం ఎంపిక నుండి పంట రక్షణ కొరకు వాడే పురుగుమందులు, యాజమాన్య పద్ధతులు ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తే పంట అత్యధిక దిగుబడి సాధించవచ్చునని తెలిపారు.