ఘనంగా సిరికొండలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినంను ఘనంగా నిర్వహించారు. దివంగత మాజీ డీఐజీ వ్యాస్, మాజీ ఎస్పీ ఉమేశ్చంద్ర, పరదేశి నాయుడు పోలీసుఅమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు కుటుంబాలకు ప్రగాఢసానుభూతిని తెలిపారు.