తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హీరో అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. నేషనల్ మీడియా ముందు తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మాట్లాడటం సరికాదన్నారు. "ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనటం హాస్యాస్పదం. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిందని అంటున్నారు." అని కోమటిరెడ్డి అన్నారు.