బీమారం మండలం మన్నెగూడెం గ్రామంలోని పల్లగుట్టపై నూతనంగా నిర్మిస్తున్న ఆలయాల నిర్మాణం కోసం, మన్నెగూడెం గ్రామానికి చెందిన విశ్రాంత ఎంపీడీఓ కట్కం జయశ్రీ ప్రభు కుటుంబం ఒక లక్షా పదహారువేలను నగదు రూపంలో విరాళంగా సోమవారం అందజేశారు. అనంతరం గ్రామంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నామనేని సత్యారావు, నరేష్, రమేష్, కిషన్ గౌడ్, సతీష్, రామకృష్ణ పాల్గొన్నారు.