రొయ్య పిల్లలను నీటిలో వదిలిన శాసనసభ్యులు

315చూసినవారు
మంచిర్యాల జిల్లా లోని ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ లక్సెట్టిపేట గోదావరి పుష్కర ఘాట్ వద్ద 12లక్షల 33 వేల రొయ్య పిల్లలను నీటిలో వదిలిన శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి సామాజిక వర్గానికి వారి ఆర్థిక స్వావలంబనకు అన్ని రకాలుగా కెసిఆర్ గారు సహకరిస్తూ వస్తున్నారని అందులో భాగంగానే మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చెరువులు ప్రాజెక్టులు నీటి కొలనులలొ మత్స్య సంపద వృద్ధి కోసం చేపపిల్లలను మరియు రొయ్యల పిల్లలను ఉచితంగా వదిలి పెడుతున్నట్టులు తెలిపారు . దానిద్వారా మత్స్య సంపద వృద్ధి చెంది మత్స్యకారుల అంతా మత్స్య సంపదను పట్టుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య, యంపిపి అన్నం మంగ చిన్నన ,యంపిడివో సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రాయలింగు, మత్స్యకారులు అధికారులు శంకర్, సత్యనారాయణ,టీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు చుంచు చిన్నయ్య,మాజీ యంపిపి కట్ల చెంద్రయ్య,టీఆర్ఎస్ నాయకులు గరిసె రవీందర్, చాతరాజు రాజన్న, , మత్స్యకారులు మరియు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్