శంకరపట్నంలో బీజేపీ శ్రేణుల సంబరాలు

74చూసినవారు
శంకరపట్నం మండల కేంద్రంలో బిజెపి మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో సోమవారం బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడాన్ని హర్షిస్తూ అంబేద్కర్ చౌరస్తా నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు ర్యాలీ తీసి బాణాసంచా కాలుస్తూ నృత్యాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్