తులసి మొక్కను హిందువులు లక్ష్మీదేవి ప్రతిరూపం భావిస్తారు. అందుకే ఎంతో పవిత్రంగా తులసి మొక్కను పూజిస్తారు. అలాంటి తులసి వద్ద కొన్ని వస్తువులు పెట్టకూడదని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్క నాటిన ప్రదేశంలో మురికి వేయకూడదు. చీపురు, చెప్పులు పెట్టకూడదు. అలాగే తులసి మొక్క సమీపంలో ముళ్ల మొక్కలను నాటకూడదు. తులసి మొక్క చుట్టూ నిండా నీరు ఉన్న బకెట్‌ను కూడా ఉంచకూడదు.