మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మాజీ జడ్పిటిసి ఎడ్ల సుగుణాకర్ తల్లి ఇటీవల మృతి చెందారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, తాజా మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు గోపు రవీందర్ రెడ్డి, అన్నారం మాజీ సర్పంచ్ బొట్ల కిషన్, తడకపల్లి నారాయణ, జేరిపోతుల సునీల్ పాల్గొని వారి కుటుంబ సభ్యులు పరమర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు.