మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని పరిధిలో జనావాసాలకు నాణ్యమైన తాగునీరు సరఫరాకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో డీపీఓ ఆశాలత, ఈఈ మిషన్ భగీరథ గ్రిడ్ పూర్ణచందర్ రావు, ఇంట్రా ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.