రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో బీరప్పస్వామి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.