మెట్ పల్లిలో ఘనంగా సీఎం పుట్టిన రోజు సంబరాలు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శాస్త్రి చౌరస్తా పాత బస్టాండ్ వద్ద శుక్రవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసి సీఎం పుట్టినరోజు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరు పాల్గొన్నారు.