మెట్ పల్లిలో భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

78చూసినవారు
మెట్ పల్లిలో భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి డి ఎస్పి ఉమామహేశ్వరరావు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వేంపల్లి గ్రామానికి చెందిన వెలుమల రమేష్ బుధవారం తన భార్య సునీతను ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంది అని అనుమానంతో చంపడం జరిగింది అని, శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కేసును త్వరగా చేధించిన కోరుట్ల సీఐ సురేష్ బాబు, మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ ని డి ఎస్పి ఉమా మహేశ్వర్ రావు అభినందించారు.

సంబంధిత పోస్ట్