పెద్దపల్లి మండలం - Peddapalle Mandal

కరీంనగర్ జిల్లా
వచ్చే ఐదేళ్లలో వినోద్ కుమార్ గెలిస్తే చేసే పనులు ఇవే
May 12, 2024, 10:05 IST/హుజురాబాద్
హుజురాబాద్

వచ్చే ఐదేళ్లలో వినోద్ కుమార్ గెలిస్తే చేసే పనులు ఇవే

May 12, 2024, 10:05 IST
అభివృద్ధి పనులను, పథకాలను సాకారం చేసే విషయంలో ఖచ్చితంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. గ్రామ స్థాయి మొదలు జిల్లా స్థాయి వరకున్న ప్రజాప్రతినిధులను సమన్వయపర్చుకుని అన్ని వేళలా ప్రజల బాగోగుల్ని చూస్తూ, తక్షణం స్పందిస్తానన్నారు. ముఖ్యంగా దిల్లీ స్థాయిలోనే ఎంపీల పాత్ర కీలకంగా ఉంటుందనీ దురదృష్టవశాత్తు గెలిచిన వాళ్లు ప్రజలకిచ్చిన హామీలను పట్టించుకోలేదన్నారు. రాజకీయాలు చేస్తూ కాలం గడిపారన్నారు. అయిదేళ్లలో బండి సంజయ్ ప్రత్యేకంగా ఎలాంటి నిధులు తీసుకు రాలేదన్నారు. కీలకమైన ప్రాజెక్టులన్నీ నేనున్నప్పుడే మంజూరయ్యాయన్నారు. కేంద్రం నుంచి నిధులు తేవడమే కాకుండా నా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపే విధంగా తన వద్ద ప్రణాళిక ఉందన్నారు. ముఖ్యంగా యువత కోసం ఐటీఈ సింగపూర్ తరహాలో ఇక్కడ టెక్నికల్ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తానన్నారు. దీని ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యంతో పాటు ఉపాధి అవకాశాల్ని పెంచుతనన్నారు. ఇది తన ముందున్న పెద్ద లక్ష్యం అని, అంతేకాకుండా రెండు జిల్లాలకు నవోదయ విద్యాలయాలను సాధిస్తానన్నారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే ప్రతి ఏడాది ఉద్యోగ మేళాలు నిర్వహించి ఏటా కొంతమందికి ఉద్యోగాలిప్పించే బాధ్యతను నేను తీసుకుంటాననన్నారు.