పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు లేని సందర్భముగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో యువకులు, అడ్వకేట్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన అందరికీ ఇండియన్ సొసైటీ పెద్దపల్లి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి, అత్యవసర పరిస్థితులలో ప్రసూతి పేషెంట్లకు రక్తం ఎంతో అవసరం అని, దాతలు ముందుకు రావాలని కోరారు. రక్తం ఇవ్వడం వల్ల చర్మవ్యాధులు , బిపి, షుగర్, కొలెస్ట్రాల్ లాంటి వ్యాధులు రాకుండా మన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతుందన్నారు. రక్తదానం చేసిన దాతలకు రెడ్ క్రాస్ చైర్మన్ కావేటి రాజగోపాల్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ షోరయ్య గారు రెడ్ క్రాస్ చైర్మన్ కావేటి రాజగోపాల్ గారు, టీవీఎస్ మూర్తి గారు, పాంపాటి శ్రీకాంత్ గారు, సంపత్ రావు, సత్యనారాయణ, సుధాకర్, శ్రీహరి రక్త నిల్వ సిబ్బంది రాము పాల్గొన్నారు