శ్రీధర్ బాబును సన్మానించిన మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలు
మహిళా కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఇటీవల నూతనంగా నియామకమైన రామగిరి మండలం ముస్త్యాల గ్రామ తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య సోమవారం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని గోదావరిఖనిలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. రాబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణ గెలుపు కోసం కృషి చేయాలని లావణ్యకు సూచించారు.