పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అరటి పండ్లు పంపిణీ జరిగింది. తాజా మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు కుమారుడు పల్లె సాక్షిత్ రావు జన్మదినం సందర్భంగా అరటి పండ్ల పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం బి. శ్యామ్, ఉపాద్యాయులు కనకం స్వామి, ఏ. మురళయ్య, శ్రీకాంత్, బి. తిరుపతి, డి. సమ్మయ్య, ఆర్. సదయ్య, కే. రాజమౌళి పాల్గొన్నారు.