Sep 25, 2024, 17:09 IST/
ఇటలీ ప్రధానితో డేటింగ్ రూమర్లపై స్పందించిన ఎలాన్ మస్క్
Sep 25, 2024, 17:09 IST
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో డేటింగ్ రూమర్లపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా స్పందించారు. న్యూయార్క్లో మెలోనికి మంగళవారం అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మస్క్ అందించారు. ఆ సమయంలో బయట కంటే ఆమె లోపల మరింత అందంగా ఉన్న వ్యక్తి అని కొనియాడారు. వీరి ఫొటోను 'మస్క్ ఫ్యాన్స్ క్లబ్' ట్వీట్ చేసి, డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించింది. తాము డేటింగ్ చేయట్లేదని మస్క్ స్పష్టం చేశారు.