ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే మాట - ముచ్చట
సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉపాధిహామీ కూలీలను కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించారు. రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు ఓటువేసి గెలిపించాలని వారిని కోరారు.