సంబరాలు జరుపుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు..

61చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం సంబరాలను జరుపుకున్నారు. సుప్రీంకోర్టు నిన్నటి రోజున హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్