జిల్లా వైద్యాధికారులతో సమీక్ష

51చూసినవారు
జిల్లా వైద్యాధికారులతో సమీక్ష
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్యశాఖ అధికారి వసంతరావు గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అన్ని కేంద్ర ఆరోగ్య పథకాలలో రాజన్న సిరిసిల్లను ముందు ఉంచాలని సూచించారు. లక్ష్యాలను సాధించలేని వైద్యాధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వైద్యులు పెంచలయ్య, రజిత, అంజలి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్