సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం నిల్వలను మిల్లుల వద్ద అన్లోడ్ చేయని పక్షంలో తాత్కాలిక గోదాముల్లోకి తరలించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం ధాన్యం కొనుగోలు సెంటర్ల ఏర్పాట్లుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలన్నారు. ఇందుకోసం సిరిసిల్ల అపెరల్ పార్కులోని గోదాములను గుర్తించామన్నారు.