Dec 10, 2024, 06:12 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: తల్లిని శ్మశానంలో వదిలి వెళ్లిన కొడుకు
Dec 10, 2024, 06:12 IST
జగిత్యాలలోని చిలకవాడకు చెందిన రాజవ్వకు నలుగురు కొడుకులు. ఎవరూ తల్లిని పట్టించుకోవడంలేదు. వృద్ధురాలు శ్మశానంలో ఉంటున్న పరిస్థితి గత నెల 28న వెలుగులోకి వచ్చింది. అప్పుడు అధికారులు ఆమె కొడుకులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వగా ఇంటికి తీసుకెళ్లారు. 12 రోజుల తర్వాత పెద్ద కొడుకు శ్రీనివాస్ సోమవారం మళ్లీ మోతె శ్మశాన వాటికలో తల్లిని వదిలి వెళ్లిపోయాడు. గత 3 రోజుల నుండి శ్మశానంలో వృద్ధురాలు బిక్కు బిక్కుమంటూ గడుపుతోంది.